Terrorists: జమ్మూకశ్మీర్‌లో 8 మంది ఉగ్రవాదుల హతం

8 Terrorists Killed In  Jammu and Kashmir
  • షోపియాన్, పాంపొరా ప్రాంతాల్లో ఘటన
  • 24 గంటలుగా ఉగ్రవాదుల కోసం ఆపరేషన్‌
  • పాంపొరాలోని ఓ మసీదులో నక్కిన ఉగ్రవాదులు
  • రాజౌరి జిల్లా నౌషెరా సెక్టార్‌లో పాక్‌ జవాన్ల కాల్పులు
జమ్మూకశ్మీర్‌లో భారత భద్రతా బలగాలు మరో ఎనిమిది మంది ఉగ్రవాదులను హతమార్చాయి. షోపియాన్, పాంపొరా ప్రాంతాల్లో 24 గంటలుగా ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు ఆపరేషన్‌ కొనసాగిస్తున్నాయి.

పాంపొరాలోని ఓ మసీదులో నక్కిన ఉగ్రవాదులను బయటకు రప్పించడానికి భద్రతా బలగాలు టియర్ గ్యాస్ షెల్స్‌ను విజయవంతంగా వినియోగించారు. మసీదుకు నష్టం కలగకుండా అన్ని చర్యలు తీసుకుని వారిని హతమార్చారు. షోపియాన్‌లో మొత్తం ఐదుగురిని, పాంపొరాలో ముగ్గుర్ని హతమార్చినట్లు అధికారులు ప్రకటించారు.

మరోవైపు, ఈ రోజు ఉదయం 10.45 నుంచి పాకిస్థాన్‌ రేంజర్లు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నారు. పాక్‌ బలగాలు కాల్పులకు తెగబడుతుండడంతో వారి దాడిని భారత భద్రతా బలగాలు తిప్పికొడుతున్నాయి. రాజౌరి జిల్లా నౌషెరా సెక్టార్‌లో పాక్‌ జవాన్లు కాల్పులకు పాల్పడుతున్నారు.
Terrorists
Jammu And Kashmir
India
Pakistan

More Telugu News