Srisailam: తిరిగి తెరచుకోనున్న శ్రీశైలం పాతాళగంగ బోటింగ్... నేడు ప్రారంభించనున్న జగన్!

Srisailam Boting Point Opening Today after Lockdown
  • లాక్ డౌన్ సమయంలో మూతబడిన జల విహార కేంద్రం
  • నేడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్న జగన్
  • ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న కలెక్టర్ వీర పాండ్యన్
ప్రసిద్ధ శైవక్షేత్రమైన శ్రీశైలంలోని పాతాళగంగ వద్ద నేటి నుంచి బోటింగ్ సేవలు, జల విహార కేంద్రం తిరిగి ప్రారంభం కానున్నాయి. లాక్ డౌన్ నిబంధనలకు అనుగుణంగా ఇందుకు ఏర్పాట్లు చేసినట్టు అధికారులు వెల్లడించారు. కరోనా వైరస్ విజృంభణ ప్రారంభమైన తరువాత, జల విహార కేంద్రాన్ని అధికారులు మూసి వేసిన సంగతి తెలిసిందే. భౌతిక దూరం, మాస్క్ లు ధరించడం తప్పనిసరి చేసి, నేటి నుంచి ఈ కేంద్రాన్ని ప్రారంభించనున్నట్టు అధికారులు తెలిపారు. ఉదయం 10 గంటలకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్నారని, శ్రీశైలంలో ఏర్పాట్లను కలెక్టర్ వీర పాండ్యన్ స్వయంగా పరిశీలిస్తున్నారని సీఎంఓ వర్గాలు వెల్లడించాయి.

Srisailam
Boting Point
Lockdown
Jagan

More Telugu News