Kamal R Khan: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ పై బయోపిక్ నిర్మిస్తా: సినీ క్రిటిక్ కమాల్ ఆర్ ఖాన్

I will make Sushant Singh biopic says critic KRK
  • బాలీవుడ్ లో ఓ వర్గం మాఫియాలా తయారైంది
  • బాలీవుడ్ ప్రముఖులను ద్వేషించడం నాకు ఇష్టం
  • కొందరి వల్ల టాలెంట్ ఉన్న నటులు తనువు చాలిస్తున్నారు
బాలీవుడ్ లో ఓ వర్గం మాఫియాలా తయారైందని వివాదాస్పద సినీ క్రిటిక్ కమాల్ ఆర్ ఖాన్ (కేఆర్కే) మండిపడ్డారు. ఇలాంటి వారి వల్ల సుశాంత్ సింగ్ రాజ్ పుత్ వంటి టాలెంట్ ఉన్న నటులు అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుశాంత్ బయోపిక్ ను తెరకెక్కిస్తానని చెప్పారు. సుశాంత్ కు న్యాయం జరగాలని అన్నారు. బాలీవుడ్ ప్రముఖులను ద్వేషించడమంటే తనకు ఇష్టమని చెప్పారు. మరోవైపు కేఆర్కేపై సుశాంత్ అభిమానులు మండిపడుతున్నారు. కేఆర్కే వంటి వ్యక్తికి సుశాంత్ చరిత్రను తెరకెక్కించే అర్హత లేదని సోషల్ మీడియా ద్వారా విమర్శిస్తున్నారు.
Kamal R Khan
Sushant Singh Rajput
Bollywood
Biopic

More Telugu News