Chandrababu: గవర్నర్ తో చంద్రబాబు భేటీ... వైసీపీపై ఫిర్యాదులు

Chandrababu met AP Governor and complained against YSRCP
  • గవర్నర్ కు 14 పేజీల లేఖ సమర్పించిన చంద్రబాబు
  • ఏడాదిగా జరుగుతున్న ఘటనలపై గవర్నర్ కు వివరణ
  • రక్షణ లేకుండా పోయిందని ఆవేదన
రాష్ట్రంలో టీడీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, అరెస్టులు చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఫిర్యాదు చేశారు. ఈ సాయంత్రం గవర్నర్ ను కలిసిన చంద్రబాబు ఏడాదిగా జరుగుతున్న పరిణామాలను ఆయనకు వివరించారు.

కేవలం 4 రోజుల వ్యవధిలో బీసీ సామాజిక వర్గానికి చెందిన ముగ్గురు మాజీ మంత్రులపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. ఈ మేరకు గవర్నర్ కు 14 పేజీలతో సుదీర్ఘ లేఖ సమర్పించారు. సంవత్సరకాలంలో 800 మంది టీడీపీ కార్యకర్తలు దాడులకు గురయ్యారని, వైసీపీ పాలనలో బడుగు, బలహీన వర్గాలకు రక్షణ లేకుండా పోయిందని తెలిపారు.
Chandrababu
Governor
Biswabhusan Harichandan
YSRCP
Telugudesam
Andhra Pradesh

More Telugu News