JC Prabhakar Reddy: జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డికి కోర్టులో చుక్కెదురు

Court rejects JC Prabhakar Reddy and his son bail pleas
  • ఇటీవలే జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి అరెస్ట్
  • ఆన్ లైన్ లో పిటిషన్లు దాఖలు చేసిన ప్రభాకర్ రెడ్డి, అస్మిత్
  • పిటిషన్లు తిరస్కరించిన అనంతపురం కోర్టు
ట్రావెల్స్ వ్యాపారాల్లో అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్ రెడ్డిలను అనంతపురం పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే బెయిల్ కోరుతూ జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి ఆన్ లైన్ లో  పిటిషన్ దాఖలు చేశారు.

వీరి బెయిల్ పిటిషన్లను విచారణకు స్వీకరించిన అనంతపురం న్యాయస్థానం ఆ పిటిషన్లను తిరస్కరించింది. ఇద్దరినీ రెండు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్నారు. కాగా, ఈ ఇద్దరిపై మరో ఐదు కేసుల్లో పీటీ వారెంట్లు జారీ అయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వీరు కడప సెంట్రల్ జైలులో ఉన్నారు.
JC Prabhakar Reddy
JC Asmit Reddy
Bail
Reject
Court
Anantapur

More Telugu News