Jagan: అఖిలపక్ష సమావేశంపై సీఎం జగన్ తో మాట్లాడిన అమిత్ షా, రాజ్ నాథ్

Union ministers invites CM Jagan to all party meeting
  • రేపు సాయంత్రం ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం
  • సీఎం జగన్ ను ఆహ్వానించిన కేంద్ర మంత్రులు
  • సానుకూలంగా స్పందించిన ఏపీ సీఎం
దేశంలో కరోనా పరిస్థితులు, లాక్ డౌన్ ఎత్తివేత, దేశ ఆర్థిక గమనం, చైనాతో సరిహద్దు ఘర్షణలు వంటి సమస్యలపై కేంద్రం రేపు అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశానికి హాజరు కావాలంటూ అన్ని పార్టీలను కేంద్రం ఆహ్వానిస్తోంది. తాజాగా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏపీ సీఎం జగన్ కు ఫోన్ చేసి మాట్లాడారు. అఖిలపక్షం ఉద్దేశాలను సీఎం జగన్ కు వెల్లడించారు.

అటు, కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ కూడా సీఎం జగన్ తో మాట్లాడారు. కేంద్రమంత్రుల ఫోన్ అనంతరం రేపు జరిగే అఖిలపక్ష సమావేశానికి హాజరవ్వాలని సీఎం జగన్ నిర్ణయించుకున్నారు. కాగా, రేపు సాయంత్రం జరిగే ఈ అఖిలపక్ష సమావేశాన్ని కరోనా వ్యాప్తి నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించనున్నారు.
Jagan
Amit Shah
Rajnath Singh
All Party Meeting
Narendra Modi
India

More Telugu News