Roja: అక్క, చెల్లెమ్మలకు అండగా నిలుస్తున్న జగనన్నకు ధన్యవాదాలు: రోజా

MLA Roja thanked to CM Jagan
  • బడ్జెట్ ప్రవేశపెట్టిన ఏపీ సర్కారు
  • రూ.2.24 లక్షల కోట్లతో బడ్జెట్
  • మహిళల పథకాలకు అధిక కేటాయింపులు అంటూ రోజా హర్షం
ఏపీ ప్రభుత్వం తాజా అసెంబ్లీ సమావేశాల్లో రూ.2.24 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ బడ్జెట్ లో వివిధ రంగాలకు కేటాయింపులను ఆ పార్టీ నేతలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా కూడా సోషల్ మీడియాలో దీనిపై పోస్టు చేశారు. అక్క, చెల్లెమ్మలకు అండగా నిలుస్తున్నారంటూ సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలిపారు. వైఎస్సార్ చేయూత, డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ పథకం, అమ్మ ఒడి అంటూ స్త్రీలకు ఉపయోగపడే పథకాలకు బడ్జెట్ లో అధిక కేటాయింపులు చేపట్టారంటూ సీఎంను కొనియాడారు.
Roja
Jagan
Budget
Andhra Pradesh
YSRCP

More Telugu News