Chandrababu: సాయుధ బలగాలకు, ప్రధాని మోదీకి అందరం మద్దతుగా నిలవాలి: చంద్రబాబు

Chandrababu calls for support to armed forces and PM Modi
  • చైనాతో సరిహద్దు ఘర్షణల్లో భారత సైనికుల మృతి
  • కల్నల్ సంతోష్ బాబు సహా 20 మంది వీరమరణం
  • వారందరికీ వందనాలు అంటూ చంద్రబాబు ట్వీట్
చైనా బలగాలతో వాస్తవాధీన రేఖ వద్ద జరిగిన ఘర్షణల్లో భారత సైనికులు 20 మంది వీరమరణం పొందడంపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు స్పందించారు. దేశ సరిహద్దులను కాపాడే క్రమంలో కల్నల్ సంతోష్ బాబు, మరికొందరు సైనికులు ప్రాణత్యాగం చేశారని కీర్తించారు. అమరవీరులకే కాకుండా, దేశ గౌరవాన్ని కాపాడేందుకు ప్రాణాలు ఒడ్డి పోరాడుతున్న సాయుధ బలగాలకు చెందిన ప్రతి ఒక్కరికీ వందనాలు సమర్పిస్తున్నానని ట్వీట్ చేశారు. ఈ సమయంలో మన సాయుధ బలగాలకు, ప్రధాని నరేంద్ర మోదీ గారికి మద్దతుగా నిలిచేందుకు ప్రతి ఒక్కరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు.
Chandrababu
Santosh Babu
Army
Armed Forces
Narendra Modi
India
China

More Telugu News