Jagan: వేదాద్రి ప్రమాద మృతులకు రూ. 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా... తెలంగాణ వారికీ వర్తింప చేస్తూ సీఎం జగన్ ఆదేశాలు

CM Jagan announces Ex Gratia for Vedadri road accident victims
  • నిన్న కృష్ణా జిల్లా వేదాద్రి వద్ద రోడ్డు ప్రమాదం
  • 12 మంది దుర్మరణం
  • 9 మంది తెలంగాణ వాసులు, ముగ్గురు ఏపీ వ్యక్తుల మృతి
కృష్ణా జిల్లా వేదాద్రి వద్ద నిన్న ఓ ట్రాక్టర్ ను లారీ ఢీకొట్టిన ఘటనలో 12 మంది దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. మృతులలో ముగ్గురు తప్ప మిగిలినవారందరూ తెలంగాణవారే. అయితే, ఘటన జరిగింది ఏపీలో కావడంతో సీఎం జగన్ మానవతా దృక్పథంతో వ్యవహరించి తెలంగాణ వారికీ వర్తించేలా రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారని సీఎంవో వెల్లడించింది. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టు ఓ ట్వీట్ లో తెలిపింది. అటు, తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకున్నారు. మృతులకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఏపీకి చెందిన ముగ్గురికి కూడా నష్టపరిహారం వర్తిస్తుందని తెలిపారు.
Jagan
Vedadri
Road Accident
Ex Gratia
Telangana
Andhra Pradesh
KCR

More Telugu News