Machilipatnam: మచిలీపట్నంలో రేపట్నుంచి లాక్ డౌన్ నిబంధనలు మరింత కఠినతరం!
- మచిలీపట్నంలో పెరుగుతున్న కరోనా కేసులు
- ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే దుకాణాలు
- రాత్రి 9 నుంచి ఉదయం 6 వరకు పూర్తి స్థాయిలో కర్ఫ్యూ
మచిలీపట్నంలో కరోనా కేసులు పెద్ద ఎత్తున నమోదవుతుండటం కలవరపరుస్తోంది. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ నిబంధనలను మరింత కఠినతరం చేస్తున్నట్టు ఆర్డీవో ఖాజావలి తెలిపారు. టాస్క్ ఫోర్స్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే దుకాణాలకు అనుమతిస్తామని చెప్పారు. రాత్రి 9 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని తెలిపారు. ఆ సమయంలో ఎవరు బయటకు వచ్చినా కేసులు నమోదు చేస్తామని చెప్పారు. కరోనా నేపథ్యంలో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వైద్యుల సూచనలను పాటించాలని హితవు పలికారు.