Gujarat: సీఎం కార్యాలయానికి మాస్క్ ధరించకుండా వచ్చిన గుజరాత్ మంత్రి.. రూ. 200 ఫైన్!

Gujarat minister pays fine for not wearing mask
  • జరిమానా విధించిన గాంధీనగర్ మున్సిపల్ అధికారులు
  • కారు దిగే సమయంలో మర్చిపోయానన్న మంత్రి
  • ఫైన్ చెల్లించి, రశీదు చూపించిన మంత్రి
కరోనా నేపథ్యంలో మాస్కును ధరించడం కంపల్సరీ చేసిన సంగతి తెలిసిందే. మాస్క్ ధరించని వారికి దాదాపు అన్ని రాష్ట్రాల్లో జరిమానా విధిస్తున్నారు. ఈ క్రమంలో గుజరాత్ లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. సీఎం కార్యాలయంలో జరిగిన కేబినెట్ సమావేశానికి వచ్చిన మంత్రి ఈశ్వరీసిన్హా పటేల్ కు అధికారులు రూ. 200 జరిమానా విధించారు. మాస్క్ లేకుండా రావడంతో ఆయనకు ఫైన్ వేశారు. ఆయన తప్ప మిగిలిన మంత్రులంతా మాస్కులను ధరించే సమావేశానికి వచ్చారు. గాంధీనగర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఈ జరిమానాను విధించారు.

సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో పటేల్ ముచ్చటించారు. జరిమానాను చెల్లించినట్టు రసీదును చూపించారు. వాస్తవానికి తాను మాస్కును ఎప్పుడూ ధరించే ఉంటానని... అయితే, కారు దిగే సమయంలో మర్చిపోయానని చెప్పారు.
Gujarat
Minister
Mask
Fine

More Telugu News