Kanna Lakshminarayana: నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను తన కార్యాలయంలోకి రాకుండా పోలీసులను మోహరించారు: కన్నా

AP BJP Chief Kanna Lakshminarayana writes Governor
  • గవర్నర్ కు లేఖ రాసిన కన్నా
  • రాజ్యాంగాన్ని పరిరక్షించాలంటూ విజ్ఞప్తి
  •  రమేశ్ కుమార్ ను ఎస్ఈసీగా పునరుద్ధరించాలని వినతి
ఏపీలో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ అంశంపై రాష్ట్ర బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు లేఖ రాశారు. రమేశ్ కుమార్ ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు చేపట్టకుండా నిరోధించడానికి ప్రభుత్వం నరకం చూపిస్తోందని ఆరోపించారు. ఆయన తన కార్యాలయంలో అడుగుపెట్టకుండా నిలువరించేందుకు పోలీసు బలగాలను మోహరించారని కన్నా స్పష్టం చేశారు. రాజ్యాంగ వ్యవస్థలను కాపాడడంలో మీ హోదాను ఉపయోగించి జోక్యం చేసుకోవాలంటూ గవర్నర్ కు ఆయన విజ్ఞప్తి చేశారు. ఎస్ఈసీగా రమేశ్ కుమార్ బాధ్యతలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. స్వయంప్రతిపత్తి కలిగిన రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యకలాపాల్లో ప్రభుత్వ జోక్యం సరికాదని కన్నా పేర్కొన్నారు.
Kanna Lakshminarayana
Governor
Biswabhusan Harichandan
Nimmagadda Ramesh Kumar
SEC
Andhra Pradesh
YSRCP

More Telugu News