Chandrababu: నాడు రాష్ట్ర ప్రయోజనాల కోసమే మోదీతో విభేదించా!: చంద్రబాబు

Chandrababu says Only Politicle diferences with Modi
  • ప్రధానితో వ్యక్తిగత విభేదాలు లేవు
  • ప్రజలను మోసం చేస్తున్న వైఎస్ జగన్
  • విమర్శలు గుప్పించిన చంద్రబాబు
ప్రధాని నరేంద్ర మోదీతో తనకు ఎటువంటి వ్యక్తిగత విభేదాలూ లేవని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. నాడు రాష్ట్ర ప్రయోజనాల కోసమే మోదీతో విభేదించానని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సహా ఎన్నో హామీలపై సీఎం వైఎస్ జగన్ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శలు గుప్పించారు.

ఇక ఏపీ గవర్నర్, ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో మూడు రాజధానుల అంశాన్ని ప్రస్తావించడాన్ని చంద్రబాబు తప్పుబట్టారు. ఇప్పటికే శాసన మండలికి వచ్చి, సెలక్ట్ కమిటీకి సిఫార్సు చేయబడిన బిల్లులను మళ్లీ ఎలా తెస్తారని చంద్రబాబు ప్రశ్నించారు. ఇవే బిల్లులపై తిరిగి మండలిలో పోరాడుతామని, ఈ విషయంలో తమ పార్టీకి మరో ఆలోచనే లేదని స్పష్టం చేశారు.
Chandrababu
Narendra Modi
Special Category Status
Jagan

More Telugu News