కరోనా బారినపడిన గోకుల్ చాట్ యజమాని... షాపుకు తాళం వేసిన అధికారులు

  • కొన్నిరోజులుగా గోకుల్ చాట్ యజమానికి అస్వస్థత
  • వైద్యపరీక్షల్లో కరోనా పాజిటివ్
  • దుకాణంలో పనిచేసే 20 మందికి క్వారంటైన్
హైదరాబాదులో రుచికరమైన ఛాట్ తినుబండారాలకు పెట్టిందిపేరైన గోకుల్ చాట్ లో కరోనా కలకలం రేగింది. ఏకంగా గోకుల్ చాట్ యజమానే కరోనా బారినపడ్డాడు. దాంతో గోకుల్ చాట్ ను అధికారులు సీజ్ చేశారు. లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో, గోకుల్ చాట్ ను ఇటీవలే తెరిచారు. కొన్నిరోజులుగా గోకుల్ చాట్ యజమాని అనారోగ్యంతో బాధపడుతుండడంతో ఆయనకు కరోనా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ వైద్యపరీక్షల్లో పాజిటివ్ అని రావడంతో ఆయనను చికిత్సకు తరలించారు. చాట్ దుకాణంలో పనిచేసే 20 మంది సిబ్బందిని క్వారంటైన్ చేశారు. గత రెండ్రోజులుగా గోకుల్ చాట్ కు వచ్చిన వారి వివరాలు సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.

Gokul Chat
Owner
Corona Virus
Positive
Quarantine Centre
Hyderabad
Telangana

More Telugu News