విలన్ పాత్రకు మహేశ్ సూచించిన నటుడు!
- 'సర్కారు వారి పాట'లో పవర్ ఫుల్ విలన్
- 'ఈగ' సుదీప్ అంటూ మొదట్లో ప్రచారం
- మహేశ్ సూచన మేర ఉపేంద్ర కోసం ప్రయత్నాలు
పరశురాం దర్శకత్వంలో మహేశ్ తాజాగా 'సర్కారు వారి పాట' అనే చిత్రాన్ని చేస్తున్నాడు. ఇటీవలే ఈ చిత్రం పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఈ చిత్రంలో పవర్ ఫుల్ పాత్ర అయిన విలన్ రోల్ కోసం మొదట్లో కన్నడ స్టార్ 'ఈగ' ఫేం సుదీప్ ను ఎంపిక చేస్తున్నట్టు టాలీవుడ్ లో ప్రచారం జరిగింది.
అయితే, తాజాగా ఈ పాత్ర కోసం మరో కన్నడ స్టార్ ఉపేంద్ర పేరు వినిపిస్తోంది. గతంలో తెలుగులో హీరోగా, విలన్ గా పలు చిత్రాలలో నటించిన ఉపేంద్ర అయితే ఈ పాత్రకు బాగుంటుందని మహేశ్ భావిస్తున్నాడట. దాంతో ప్రస్తుతం ఆయన కోసం యూనిట్ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.