New Delhi: ఢిల్లీ ఆరోగ్య మంత్రికి కరోనా అనుమానం... హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు!

Delhi Health Minister Hospitalises
  • గత రాత్రి తీవ్ర జ్వరం
  • పడిపోయిన సత్యేందర్ జైన్ ఆక్సిజన్ లెవల్స్
  • రాజీవ్ గాంధీ హాస్పిటల్ లో చికిత్స
ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్, కరోనా లక్షణాలతో రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో చేరారు. ఆయనకు నేడు కరోనా పరీక్షలు జరుగనున్నాయి. ప్రస్తుతం 55 ఏళ్ల వయసులో ఉన్న సత్యేందర్ జైన్, ఈ విషయాన్ని స్వయంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ ఉదయం వెల్లడించారు.

"గత రాత్రి నాకు తీవ్రమైన జ్వరం వచ్చింది. ఇదే సమయంలో నా శరీరంలోని ఆక్సిజన్ స్థాయి పడిపోయింది. నన్నిప్పుడు ఆసుపత్రిలో చేర్చారు. నా ఆరోగ్యంపై పూర్తి వివరాలు తదుపరి తెలియజేస్తాను" అని ఆయన ట్వీట్ చేశారు. కాగా, సోమవారం నాడు అమిత్ షా నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి సీఎం కేజ్రీవాల్ తో పాటు సత్యేందర్ జైన్ కూడా హాజరు కావడంతో అధికారుల్లో ఆందోళన నెలకొంది. కాగా, సత్యేందర్ జైన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, పలువురు ట్వీట్లు పెడుతున్నారు.
New Delhi
Satyender Jain
Corona Test

More Telugu News