Uttam Kumar Reddy: కరోనా పరీక్షల చార్జీలు ప్రభుత్వమే భరించాలి: ఉత్తమ్ కుమార్

Uttam Kumar Reddy asks Telangana government to bear corona test charges
  • కొవిడ్ టాస్క్ ఫోర్స్ తో ఉత్తమ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్
  • పాత జిల్లా కేంద్రాల్లో కరోనా ఆసుపత్రులు తెరవాలని డిమాండ్
  •  కాంగ్రెస్ పై ఆంక్షలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయం
తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కరోనా టాస్క్ ఫోర్స్ తో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో తీర్మానించిన అంశాలను వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా వైద్య పరీక్షల చార్జీలను ప్రభుత్వమే భరించాలని, తెలంగాణలో ఐసీఎంఆర్ అనుమతులు ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు, ల్యాబ్ లలో కరోనా టెస్టులు చేయాలని తీర్మానించినట్టు తెలిపారు. పాత జిల్లా కేంద్రాలు అన్నింటిలో కొవిడ్ ఆసుపత్రులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కరోనా సాకుగా చూపిస్తూ కేవలం కాంగ్రెస్ పార్టీపైనే విధిస్తున్న ఆంక్షలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించినట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి ట్వీట్ చేశారు.
Uttam Kumar Reddy
Telangana
Corona Virus
Tests
Charges

More Telugu News