Sushant Singh Rajput: సుశాంత్ సింగ్ ఆత్మహత్యపై మాజీ ప్రియురాలు అంకిత స్పందన

Former girl friend Ankita Lokhande reacts on Sushant Singh Rajput
  • 'పవిత్ర రిష్టా' అనే సీరియల్ లో కలిసి నటించిన సుశాంత్, అంకిత
  • ఆరేళ్ల పాటు కొనసాగిన ప్రేమ ప్రయాణం
  • విడిపోయిన తర్వాత కూడా మంచి స్నేహితులుగా కొనసాగన వైనం
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నిన్న ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ వార్త విని సుశాంత్ మాజీ ప్రియురాలు, నటి  అంకితా లోఖండే షాక్ కు గురయ్యారు. ఓ మీడియా ప్రతినిధి ఫోన్ చేసి చెప్పేంత వరకు... ఆమెకు సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలియదు. జరిగిన దుర్ఘటన గురించి సదరు జర్నలిస్టు ఆమెకు చెప్పగానే... ఆమె షాక్ కు గురయ్యారట. షాక్ లో... 'ఏంటి' అని అడిగి... ఆ వెంటనే ఫోన్ పెట్టేశారట.

సుశాంత్, అంకిత ఇద్దరూ గతంలో జీటీవీలో ప్రసారమైన 'పవిత్ర రిష్టా' అనే సీరియల్ లో కలిసి నటించారు. ఆ సమయంలోనే ఇద్దరూ ప్రేమలో పడ్డారు. దాదాపు ఆరేళ్ల పాటు వీరి ప్రేమాయణం కొనసాగింది. ఆ తర్వాత ఇద్దరూ విడిపోయారు. అయితే, విడిపోవడానికి కారణం ఏమిటనేది మాత్రం వీరిద్దరిలో ఎవరూ, ఏనాడూ బయటకు వెల్లడించలేదు. సుశాంత్ తో విడిపోయే ముందు... ఒంటరినని బాధ పడకు, నీ గుండెల్లో నేను ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతానని ఆమె ట్వీట్ చేశారు.  

ఆ తర్వాత సుశాంత్ సినీ రంగంలో అడుగుపెట్టి, బిజీ అయిపోయాడు. 'మణికర్ణిక' చిత్రంలో అంకిత ముఖ్య పాత్రలో కనిపించింది. వీరిద్దరూ విడిపోయాక కూడా మంచి స్నేహితులుగా కొనసాగడం గమనార్హం. ఇటీవలే అంకితకు విక్కీ జైన్ అనే వ్యక్తితో నిశ్చితార్థం అయినట్టు వార్తలు వచ్చాయి. అయితే, దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడలేదు.
Sushant Singh Rajput
Ex Lover
Ankita Lokhande
Bollywood

More Telugu News