Gorantla Butchaiah Chowdary: కరోనా సాకుతో రెండ్రోజుల్లో సభ ముగించాలని చూడడం రాష్ట్రానికి పట్టిన దౌర్భాగ్యం: గోరంట్ల

Gorantla Butchaiah comments on YCP government
  • రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని వ్యాఖ్యలు
  • విపక్షాల గొంతు నొక్కుతున్నారని మండిపాటు
  • ప్రజలే తిరగబడి బుద్ధి చెబుతారని స్పష్టీకరణ
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి అసెంబ్లీ సమావేశాలపై స్పందించారు. కరోనా సాకుతో రెండ్రోజుల్లో సభ ముగించాలని చూడడం రాష్ట్రానికి పట్టిన దౌర్భాగ్యం అని వ్యాఖ్యానించారు.  రాష్ట్రంలో అరాచక పాలనకు వైసీపీ సర్కారు నాంది పలికిందని అన్నారు.

వినాశకాలే విపరీత బుద్ధి అనేట్టుగా జగన్ ప్రభుత్వ విధానాలు ఉన్నాయని విమర్శించారు. తమ వైఫల్యాలు బయటపడకుండా చూసుకునేందుకు విపక్షాల గొంతు నొక్కుతున్నారని మండిపడ్డారు. ఇక ప్రజలు కూడా ఈ ప్రభుత్వానికి తాత్కాలికంగా భయపడవచ్చేమో కానీ, ఏదో ఒకరోజు తిరగబడి బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు.
Gorantla Butchaiah Chowdary
Jagan
Andhra Pradesh
YSRCP
Telugudesam

More Telugu News