Nara Lokesh: జగన్ గారూ... ప్రతిదీ గుర్తుపెట్టుకుంటా, వడ్డీతో సహా చెల్లిస్తా: నారా లోకేశ్

I will repay everything with interest warns Nara Lokesh
  • ఇప్పుడు టీడీపీ నాయకుల జోలికి కూడా వస్తున్నారు
  • చిప్పకూడు తిన్న జగన్ అందరినీ జైలుకు పంపాలనుకుంటున్నారు
  • అక్రమ కేసులకు సమాధానం చెపుతాం
ఏకంగా ముగ్గురు టీడీపీ కీలక నేతలు అరెస్ట్ కావడం టీడీపీని షాక్ కు గురి చేస్తోంది. అక్రమ కేసులను బనాయిస్తున్నారంటూ వైసీపీపై టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలోని జేసీ దివాకర్ రెడ్డి ఇంటికి నేడు నారా లోకేశ్ వెళ్లారు. జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలను రిమాండ్ కు పంపిన నేపథ్యంలో కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. అనంతరం ట్విట్టర్ ద్వారా ఆయన స్పందిస్తూ... ముఖ్యమంత్రి జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

తాడిపత్రిలోని జేసీగారి కుటుంబాన్ని పరామర్శించానని లోకేశ్ అన్నారు. తొలుత తమ కార్యకర్తల జోలికి వచ్చారని, ఇప్పుడు నాయకుల జోలికి వస్తున్నారని... ప్రతిదీ గుర్తు పెట్టుకుంటానని, వడ్డీతో సహా చెల్లిస్తానని హెచ్చరికలు జారీ చేశారు. 16 నెలలు చిప్పకూడు తిన్న జగన్ అందరినీ జైలుకు పంపించాలని ఆశపడుతున్నారని ఎద్దేవా చేశారు. అక్రమ కేసులన్నింటికీ సమాధానం చెపుతామని  అన్నారు. ఈ సందర్భంగా దివాకర్ రెడ్డితో చర్చలు జరుపుతున్న ఫొటోలను పోస్ట్ చేశారు.
Nara Lokesh
JC Diwakar Reddy
JC Prabhakar Reddy
Telugudesam
Jagan
YSRCP

More Telugu News