Raviteja: మల్టీస్టారర్ కి ఓకే చెప్పిన రవితేజ!

Raviteja gives nod for multi starrer
  • తెలుగులో మరో మలయాళ రీమేక్ 
  • రవితేజ, రానా కలసి మల్టీస్టారర్
  • ఆగస్టు నుంచి షూటింగుకి ఏర్పాట్లు
  • దర్శకుడిగా హరీశ్ శంకర్ పేరు ప్రచారం  
తెలుగులో మల్టీ స్టారర్లు కొత్తేమీ కాదు.. ఎన్టీఆర్, ఏఎన్నార్ ల కాలం నుంచీ ఇలాంటి చిత్రాలు వస్తున్నాయి. అయితే, ఇలాంటి చిత్రాల నిర్మాణానికి కథే పెద్ద ఇబ్బంది. ఇద్దరు స్టార్ల ఇమేజ్ ను బ్యాలెన్స్  చేస్తూ.. ఇద్దర్నీ హైలైట్ చేస్తూ కథ రాయాలి. అది కత్తి మీద సాము. అందుకే, చాలామంది స్టార్ హీరోలకు మల్టీస్టారర్ చిత్రాలు చేద్దామని ఉన్నప్పటికీ, కథ దొరకక వెనుకంజ వేస్తుంటారు. అయితే, ఇటీవలి కాలంలో మళ్లీ ఈ తరహా చిత్రాలు బాగానే వస్తున్నాయి. ఆ కోవలోనే రవితేజ, రానా కలసి ఓ మల్టీస్టారర్ చేస్తున్నారు.

ఇటీవలి కాలంలో మలయాళంలో మంచి హిట్ సినిమాగా పేరుతెచ్చుకున్న 'అయ్యప్పనుమ్ కోషియం' చిత్రాన్ని ఇప్పుడు తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఒరిజినల్ వెర్షన్ లో నటించిన బిజూ మీనన్, పృథ్వీ రాజ్ ల పాత్రలను తెలుగులో రవితేజ, రానా చేయనున్నట్టు తెలుస్తోంది. వీరిద్దరూ ఇందుకు డేట్స్ కూడా కేటాయించినట్టు చెబుతున్నారు. దీంతో షూటింగును ఆగష్టులో ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎటొచ్చీ దర్శకుడి ఎంపికే ఇంకా పూర్తికాలేదు. అయితే, దర్శకుడిగా హరీశ్ శంకర్ పేరు మాత్రం బాగా వినిపిస్తోంది.  
Raviteja
Rana
Harish Shankar
Ayyappanum Koshiyam

More Telugu News