sushanth: సుశాంత్ ఫొటోలను వెంటనే డిలీట్‌ చేసేయాలి: వార్నింగ్ ఇచ్చిన పోలీసులు

police warns netizens
  • బాలీవుడ్‌ హీరో సుశాంత్ నిన్న ఆత్మహత్య
  • కలచివేసేలా ఉన్న ఆయనకు సంబంధించిన ఫొటోలు షేర్
  • చట్టరీత్యా నేరమన్న మహారాష్ట్ర పోలీసులు  
బాలీవుడ్‌ హీరో సుశాంత్ ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో కలచివేసేలా ఉన్న ఆయనకు సంబంధించిన ఫొటోలను చాలా మంది సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తున్నారు. దీనిపై మహారాష్ట్ర సైబర్ పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. అటువంటి ఫొటోలను షేర్ చేయడం చట్టరీత్యా నేరమని తెలిపారు.

వాటిని షేర్ చేస్తే  చర్యలు తీసుకుంటామని ట్వీట్ చేశారు. నెటిజన్లు ఇప్పటికే తమ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిన ఆ ఫొటోలను తొలగించాలని సూచించారు. దీంతో ఈ విషయం గురించి తెలుసుకున్న నెటిజన్లు పలువురు ఇప్పటికే సుశాంత్‌ మృతదేహానికి సంబంధించిన ఫొటోలను డిలీట్ చేశారు.
sushanth
Bollywood
Police

More Telugu News