Corona Virus: చంద్రబాబు ఇంటి వద్ద విధులు నిర్వహించిన పోలీసుకు కరోనా!

Conistable gets Corona Positive After Duty at Chandrababu House
  • హైదరాబాద్ కు విధుల నిమిత్తం రాక
  • తోటి కానిస్టేబుల్ నుంచి సోకిన వైరస్
  • ప్రస్తుతం చికిత్స చేస్తున్న వైద్యులు
హైదరాబాద్ లో చంద్రబాబు నివాసం వద్ద బందోబస్తు విధులు నిర్వహించిన ఓ కానిస్టేబుల్ కు కరోనా సోకింది. వివరాల్లోకి వెళితే, బాపట్ల టౌన్ పోలీసు స్టేషన్ లో పనిచేసే ఇతను, మే 5న విధుల్లో భాగంగా హైదరాబాద్ వెళ్లాడు. దాదాపు నెల రోజుల పాటు చంద్రబాబు ఇంటి వద్ద బందోబస్తు విధుల్లో పని చేసి, ఈ నెల 7న తిరిగి బాపట్లకు వచ్చాడు.

ఆపై అనారోగ్యం బారిన పడగా, కరోనా లక్షణాలు కనిపించడంతో వైద్యులు మూడు రోజుల క్రితం నమూనాలు సేకరించారు. ఆపై వచ్చిన ఫలితాల్లో ఇతనికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. హైదరాబాద్ లో పని చేస్తున్న సమయంలో తోటి కానిస్టేబుల్ నుంచి ఇతనికి వైరస్ వ్యాపించినట్టు సమాచారం. ప్రస్తుతం అతనికి చికిత్స జరుగుతోంది.
Corona Virus
Conistable
Virus
Chandrababu

More Telugu News