Perni Nani: త్వరలోనే ఏపీ నుంచి తెలంగాణకు బస్సులు: పేర్ని నాని

Buses from AP to Telangana resumes shortly says Perni Nani
  • బస్సులు లేక ఇబ్బంది పడుతున్న జనాలు
  • తెలంగాణ మంత్రి పువ్వాడతో చర్చిస్తామన్న ఏపీ మంత్రి
  • తెలంగాణ మంత్రి, అధికారులను విజయవాడకు ఆహ్వానించి చర్చిస్తామని వ్యాఖ్య
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. వాహనాల ప్రయాణాలకు తెలంగాణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ... ఏపీ మాత్రం అంతర్రాష్ట్ర ప్రయాణాలకు ఇంకా ఆమోదం తెలపలేదు. దీంతో, సొంత వాహనాలు ఉన్నవారు మాత్రం ఈ-పాసులు తీసుకుని ప్రయాణాలు చేస్తున్నారు. సొంత వాహనాలు లేని వారు మాత్రం బస్సు సర్వీసులు ఎప్పుడు ప్రారంభమవుతాయా? అని ఎదురు చూస్తున్నారు.

 ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి పేర్ని నాని తీపి కబురు అందించారు. త్వరలోనే ఏపీ నుంచి తెలంగాణకు బస్ సర్వీసులను ప్రారంభిస్తామని చెప్పారు. ఈ విషయంపై తెలంగాణ రవాణా మంత్రి పువ్వాడ అజయ్ తో చర్చిస్తామని తెలిపారు. తెలంగాణ మంత్రి, అధికారులను విజయవాడకు ఆహ్వానించి చర్చిస్తామని చెప్పారు.
Perni Nani
RTC Buses
YSRCP

More Telugu News