పోలీసులు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారు: ఉత్తమ్ కుమార్ రెడ్డి
- గోదావరి పెండింగ్ ప్రాజెక్టుల సందర్శనకు కాంగ్రెస్ యత్నం
- పోలీసులు అడ్డుకున్నారంటూ ఉత్తమ్ ఆగ్రహం
- ప్రజలు అన్నీ గమనిస్తుంటారని వ్యాఖ్య
గోదావరి పెండింగు ప్రాజెక్టులను సందర్శించడానికి అనుమతి ఇవ్వాలని తెలంగాణ డీజీపీకి లేఖ రాశామని, కానీ కాంగ్రెస్ నేతలను, కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేశారని విమర్శించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని సర్కారును హెచ్చరించారు. తమ పార్టీ నేతలను పోలీసులు అరెస్ట్ చేయడంతో, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా తుమ్మిడి హట్టి రిజర్వాయర్ సందర్శనను రద్దు చేసుకున్నారు.