Kamala Hassan: తెలుగులోకి డబ్ అవుతున్న నాటి తమిళ సూపర్ హిట్!

Pathinaru Vayadhinile is being dubbed into Telugu
  • 1977లో తమిళంలో వచ్చిన 'పదినారు వయదినిలే'
  • తెలుగులో 'పదహారేళ్ల వయసు' పేరిట రీమేడ్
  • ఓటీటీ ద్వారా తెలుగు డబ్బింగ్ విడుదల  
1977లో తమిళంలో వచ్చిన సినిమా 'పదినారు వయదినిలే'. కమలహాసన్, రజనీకాంత్, శ్రీదేవి నటించిన ఈ చిత్రం అప్పట్లో ఓ సంచలనం. గ్రామీణ వాతావరణంలో సరికొత్త కథాంశంతో దర్శకుడు భారతీ రాజా రూపొందించిన ఈ చిత్రం శ్రీదేవి, కమల్, రజనీలకు ఎంతో పేరుతెచ్చింది. ఇళయరాజా సంగీతం ఉర్రూతలూగించింది. ప్రేక్షకులకు బాగా నచ్చేయడంతో సూపర్ హిట్టయింది. ఆ వెంటనే దర్శకుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో దీనిని 'పదహారేళ్ల వయసు' పేరుతో తెలుగులో రీమేక్ చేశారు. చంద్రమోహన్, మోహన్ బాబు, శ్రీదేవి నటించగా, ఇది కూడా సూపర్ హిట్టయింది.

ఇక ఇప్పుడు అసలు విషయానికి వస్తే, తమిళ వెర్షన్ అయిన 'పదినారు వయదినిలే' చిత్రాన్ని ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు తెలుగులోకి అనువదిస్తున్నారు. నేటి ట్రెండుకి తగ్గట్టుగా డాల్బీ సౌండ్ పద్ధతిలో దీనిని డబ్ చేస్తున్నారు. ఈ తెలుగు అనువాదానికి  'నీకోసం నిరీక్షణ' అనే టైటిల్ని నిర్ణయించినట్టు నిర్మాత బామారాజ్ తెలిపారు. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా ముప్పై నిమిషాల నిడివి గల దృశ్యాలకు కాస్త మార్పులు చేసినట్టు ఆయన చెప్పారు. త్వరలో ఈ చిత్రాన్ని ఓటీటీ ద్వారా విడుదల చేస్తారు. అప్పట్లో తమిళ వెర్షన్ ని చూడలేని వారు ఇప్పుడు దానిని తెలుగులో చూడచ్చన్న మాట!    
Kamala Hassan
Rajanikanth
Sridevi
Bharathi Raja

More Telugu News