China: రాజధాని బీజింగ్ లో కరోనా కేసులు... మరో లాక్ డౌన్ దిశగా చైనా

New corona cases emerges in China
  • చైనాలో కరోనా రెండోసారి వ్యాప్తి
  • బీజింగ్ లో రెండ్రోజుల వ్యవధిలో 11 కేసులు
  • ఇదే పరిస్థితి కొనసాగితే లాక్ డౌన్ విధించే అవకాశం
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ జన్మస్థానం చైనాలోని వుహాన్. మూడ్నెల్ల పాటు చైనాను వణికించిన కరోనా ఆపై ప్రపంచదేశాలపై పడింది. కానీ, చైనాలో తగ్గిందనుకున్న కరోనా ఉద్ధృతి మళ్లీ మొదలైంది.

రాజధాని బీజింగ్ లో కొత్తగా పాజిటివ్ కేసులు నమోదు కావడం అధికార వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది. దాంతో కరోనా సోకిన వారితో సన్నిహితంగా మెలిగినవారిని గుర్తించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వారందరికీ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. గత రెండు నెలలుగా కొత్త కేసులు లేవని భావిస్తున్న అధికారులు రెండ్రోజుల వ్యవధిలో 11 పాజిటివ్ కేసులు రావడంతో కరోనా రెండో విజృంభణ తప్పదని భావిస్తున్నారు. దీంతో మరోసారి లాక్ డౌన్ విధించే దిశగా అధికార యంత్రాంగం వ్యూహరచన చేస్తోంది. అయితే మరికొన్నిరోజుల పాటు ఇదే తరహాలో కేసులు వస్తే లాక్ డౌన్ తప్పదన్న సంకేతాలు వస్తున్నాయి.
China
Corona Virus
Positive
Beijing
Wuhan

More Telugu News