సీఎస్ నీలం సాహ్నీ పదవీకాలం పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

AP government extends CS Neelam Sahni tenure
  • కేంద్రం ఉత్తర్వులతో రాష్ట్ర సర్కారు నిర్ణయం
  • సీఎస్ గా మరో 3 నెలలు కొనసాగనున్న సాహ్నీ
  • జూలై 1 నుంచి సెప్టెంబరు 30 వరకు పొడిగింపు
ఏపీలో వైసీపీ ప్రభుత్వం వచ్చాక అప్పటివరకు సీఎస్ గా ఉన్న ఎల్వీ సుబ్రహ్మణ్యంను మరో పదవికి పంపడం తెలిసిందే. ఎల్వీ స్థానంలో నీలం సాహ్నీ కొత్త సీఎస్ గా బాధ్యతలు చేపట్టారు. తాజాగా ఆమె పదవీకాలం మరో 3 నెలలు పొడిగిస్తూ రాష్ట్ర సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఉత్తర్వులతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తాజా ఉత్తర్వుల ప్రకారం నీలం సాహ్నీ జూలై 1 నుంచి సెప్టెంబరు 30 వరకు సీఎస్ గా కొనసాగుతారు.
Go Back to Shorts
Neelam Sahni
CS
Andhra Pradesh
Tenure
Extension

More Telugu News