అచ్చెన్నాయుడి అరెస్టుపై హోంమంత్రి మేకతోటి సుచరిత స్పందన

  • మందుల కొనుగోళ్లలో అక్రమాలు
  • వైద్య పరికరాల కొనుగోళ్లలోనూ అవినీతి
  • చట్టం తనపని తాను చేసుకుంటూ పోతోంది
  • అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవద్దా?
టీడీపీ నేత అచ్చెన్నాయుడిని అరెస్టు చేసిన విషయంపై ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత స్పందించారు. మందుల కొనుగోళ్లలో ఆయన అక్రమాలకు పాల్పడిన నేపథ్యంలోనే ఆయనను అరెస్టు చేశారని తెలిపారు. వైద్య పరికరాల కొనుగోళ్లలోనూ అవినీతి జరిగిందని ఆమె చెప్పారు.

ఈ విషయంలో చట్టం తనపని తాను చేసుకుంటూ పోతోందని మేకతోటి సుచరిత వ్యాఖ్యానించారు. అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవద్దా? అని ఆమె ప్రశ్నించారు. ఈ విషయంపై కొందరు గందరగోళం సృష్టించేలా వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు.

Mekathoti Sucharitha
Atchannaidu
Andhra Pradesh

More Telugu News