Balakrishna: అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా: బాలకృష్ణ

Balakrishna thanked everyone who wished him on birthday
  • నిన్న బాలయ్య పుట్టినరోజు
  • 60వ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షల వెల్లువ
  • ఫేస్ బుక్ లో సందేశం పోస్టు చేసిన బాలయ్య
నిన్ననే 60వ పుట్టినరోజు జరుపుకున్న నందమూరి బాలకృష్ణ తనకు శుభాకాంక్షలు తెలియజేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. గత కొన్నిరోజులుగా వివిధ మాధ్యమాల ద్వారా తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారని వెల్లడించారు.

"మా చిత్ర పరిశ్రమ ప్రముఖులకు, దర్శక నిర్మాతలకు, శ్రేయోభిలాషులకు, బంధుమిత్రులకు, కళాకారులకు, హితులకు, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ సిబ్బందికి, ఎన్బీకే ఫ్యాన్స్ కన్వీనర్స్ కు, ఎన్బీకే హెల్పింగ్ హ్యాండ్స్ వారికి , మన బాలయ్య.కామ్ నిర్వాహకులకు, ఎన్నారై ఫ్యాన్స్ కు పేరుపేరునా కృతజ్ఞతాభివందనాలు" అంటూ ఫేస్ బుక్ లో పోస్టు చేశారు.

ముఖ్యంగా, ఎలాంటి స్వార్థం లేకుండా ఎల్లవేళలా తన వెంట నడుస్తూ, తన పుట్టినరోజును ఒక పండుగలా జరుపుకునే అభిమానులకు కృతజ్ఞతలు అంటూ తన పోస్టులో పేర్కొన్నారు.
Balakrishna
Birthday
Wishes
Thanks
Fans

More Telugu News