Balakrishna: చెప్పేదేం లేదు... సినిమా హిట్టే!: బాలకృష్ణ ధీమా

Balakrishna confident on his upcoming movie with Boyapati
  • టీజర్ ట్రెండింగ్ లో ఉందన్న బాలయ్య
  • అంచనాలు ఎక్కడికి వెళ్లిపోయాయని వెల్లడి
  • రెట్టింపు వేగంతో పనిచేసి సినిమా పూర్తిచేస్తామని వివరణ
బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న మూడో చిత్రం విడుదలకు ముందే సందడి చేస్తోంది. అందుకు కారణం, బాలయ్య జన్మదినం సందర్భంగా విడుదలైన టీజరే. అందులో ఈ నందమూరి సీనియర్ హీరో పలికిన పవర్ ఫుల్ డైలాగులు అభిమానులను విపరీతంగా అలరిస్తున్నాయి.

దీనిపై బాలకృష్ణ స్పందించారు. బోయపాటితో తాను నటించిన సినిమాలన్నీ హిట్ అయ్యాయని, ఇప్పుడొస్తున్న మూడో చిత్రం కూడా హిట్టేనని ధీమా వ్యక్తం చేశారు. హిట్ కాకుండా ఎక్కడికి పోతుంది అంటూ వ్యాఖ్యానించారు. సహజంగానే బోయపాటి, తాను సినిమాలను వేగంగా పూర్తి చేస్తుంటామని, ఇప్పుడున్న పరిస్థితుల్లో రెట్టింపు వేగంతో పూర్తిచేయాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. తన చిత్రం టీజర్ ట్రెండింగ్ లో ఉందంటూ ఆయన హర్షం వ్యక్తం చేశారు. టీజర్ ఈ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసిందని, అంచనాలు ఎక్కడికో వెళ్లిపోయాయని తెలిపారు.
Balakrishna
Boyapati Sreenu
New Movie
Hit
BB3

More Telugu News