Sujeeth: కొద్ది మంది సమక్షంలో యంగ్ డైరెక్టర్ సుజీత్ నిశ్చితార్థం

Sujeeth get set to marry his girl friend
  • ప్రేయసితో నిశ్చితార్థం
  • సాహోతో పెద్ద గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు 
  • చిరంజీవితో 'లూసిఫర్' రీమేక్ చేస్తున్న సుజీత్
రన్ రాజా రన్ తో ఎంట్రీ ఇచ్చి రెండో సినిమా సాహోతో పాన్ ఇండియా ప్రచారం దక్కించుకున్న టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ సుజీత్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు. సుజీత్ కొంతకాలంగా ప్రవల్లిక అనే అమ్మాయితో ప్రేమలో ఉన్నాడు. ప్రవల్లిక ఓ దంత వైద్యురాలు. వీరి ప్రేమకు పెద్దలు కూడా ఓకే చెప్పడంతో గత రాత్రి ఎంగేజ్ మెంట్ జరిగింది. కొద్దిమంది కుటుంబ సభ్యులు, పరిమితంగా బంధుమిత్రుల నడుమ ఈ వేడుక జరిగింది. వివాహం ఎప్పుడన్నదానిపై త్వరలోనే స్పష్టత రానుంది.

కాగా, సుజీత్... మెగాస్టార్ చిరంజీవితో మలయాళ చిత్రం 'లూసిఫర్' రీమేక్ చేసే చాన్స్ దక్కించుకున్నాడు. ప్రస్తుతం దీని స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. షార్ట్ ఫిలింస్ తో గుర్తింపు తెచ్చుకున్న సుజీత్ కొద్దికాలంలోనే స్టార్లను డైరెక్ట్ చేసే స్థాయికి ఎదగడం విశేషం.
Sujeeth
Engagement
Pravallika
Dentist
Wedding
Tollywood

More Telugu News