India: గత రాత్రి నుంచి సరిహద్దులో భారత్‌-పాక్‌ మధ్య కాల్పులు

firing between india pak
షార్ట్స్‌లో చూడండి
సరిహద్దుల వద్ద పాకిస్థాన్‌ మరోసారి దుందుడుకు చర్యలకు పాల్పడుతోంది. పదే పదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ కయ్యానికి కాలు దువ్వుతోంది. గత రాత్రి నుంచి సరిహద్దుల్లో పాకిస్థాన్‌ రేంజర్లు కాల్పులకు తెగబడ్డారు. పాక్‌ పాల్పడుతోన్న చర్యలకు భారత్ గట్టిగా సమాధానం ఇస్తోంది. మంజకోట్‌, బాలాకోట్‌, కరోల్ మైట్రాన్‌ సెక్టార్లలో పాకిస్థాన్‌ కాల్పులు జరుపుతోంది.  

పాక్‌ రేంజర్ల కాల్పుల్లో ఓ భారత జవాను ప్రాణాలు కోల్పోయాడు. ఆయన మంజకోట్‌ సెక్టార్‌ వద్ద మృతి చెందాడని, ఇదే ప్రాంతంలో మరొకరికి గాయాలయ్యాయని అధికారులు మీడియాకు తెలిపారు. మంజకోట్‌లో రాత్రి నుంచి పాక్‌-భారత్‌ మధ్య కాల్పులు కొనసాగుతున్నాయని వివరించారు.
Go Back to Shorts
India
Pakistan

More Telugu News