Vijayasai Reddy: 32 ఏళ్ల రామ్మోహన్ కు ముళ్ల కిరీటం తగిలిస్తున్నాడు: విజయసాయిరెడ్డి

Vijayasai Reddy satires on Chandrababu and Nara Lokesh
  • టీడీపీ సీనియర్లంతా చేతులెత్తేశారు
  • కొడుకేమో తిండికి తిమ్మరాజు, పనికి పోతురాజు
  • రామ్మోహన్ ను బలిపీఠం ఎక్కిస్తున్నారు
టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేశ్ పై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కొడుకేమో తిండికి తిమ్మరాజు, పనికి పోతురాజని ఎద్దేవా చేశారు. పార్టీలోని సీనియర్లంతా చేతులెత్తేశారని... ఎవరైతే ఏంటనే భావనతో 32 ఏళ్ల రామ్మోహన్ నాయుడికి ముళ్లకిరీటాన్ని చంద్రబాబు తగిలిస్తున్నారని అన్నారు. విశాఖ రాజధాని కాకుండా అడ్డుకోవాలని చూసి నవ్వులపాలయ్యారని... ఇప్పుడు ఉత్తరాంధ్ర ప్రజలను బుజ్జగించాలనే ఉద్దేశంతో అమాయకుడిని బలిపీఠం ఎక్కిస్తున్నారని చెప్పారు.

'కరోనా నియంత్రణతో పాటు ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్న రాష్ట్రంగా ఏపీ అగ్రస్థానంలో నిల్చింది. 108,104 అంబులెన్సులు ప్రాణం పోసుకున్నాయి. ప్రభుత్వ హాస్పిటళ్లు కార్పొరేట్ సంస్థలతో పోటీ పడేలా జగన్ గారు దిశా నిర్దేశం చేశారు. రెండేళ్లలో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది.

పాలన ఎప్పుడు ‘సిటిజెన్ సెంట్రిక్‘ గా ఉండాలని పొలిటికల్ సైన్స్ గ్రంథాలు చెబ్తాయి. దీనిపై ఇప్పటికీ అనేక అధ్యయనాలు జరుగుతున్నాయి. ప్రజా సంక్షేమం, పారదర్శకత, బాధ్యత, తక్షణ స్పందన ఉండాలనేదే వీటి సారాంశం. జగన్ గారు సీఎంగా బాధ్యతలు చేపట్టాక ఇవన్నీ హర్షణీయ స్థాయిలో అమలవుతున్నాయి' అని విజయసాయి ట్విట్టర్ ద్వారా తెలిపారు.
Vijayasai Reddy
YSRCP
Kinjarapu Ram Mohan Naidu
Telugudesam
Chandrababu
Nara Lokesh

More Telugu News