కరోనాతో ఆసుపత్రిపాలైన బీజేపీ యువనేత జ్యోతిరాదిత్య సింధియా
- జ్వరం, గొంతునొప్పితో బాధపడుతున్న జ్యోతిరాదిత్య
- మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స
- జ్యోతిరాదిత్య తల్లికి సైతం కరోనా పాజిటివ్
జ్యోదిరాదిత్య జ్వరం, గొంతునొప్పితో బాధపడుతుండగా, ఆయన తల్లిలో మాత్రం ఎలాంటి లక్షణాలు బయటపడలేదు. కాగా, దేశ రాజధాని ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 27 వేలు దాటింది. నిత్యం వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతుండడంతో ఆసుపత్రుల్లో రద్దీ ఏర్పడుతోంది. అటు, సీఎం కేజ్రీవాల్ సైతం అస్వస్థతకు గురికావడంతో కరోనా వైద్య పరీక్షలు తప్పలేదు.