Chiranjeevi: జగన్‌తో భేటీ కోసం గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సినీ ప్రముఖులు.. వీడియో ఇదిగో

tollywood directors to meet with jagan
  • చిరంజీవి నేతృత్వంలో ఏపీకి దర్శకులు, నిర్మాతలు
  • హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో వెళ్లిన ప్రముఖులు
  • మధ్యాహ్నం 3 గంటలకు తాడేపల్లిలో జగన్‌తో సమావేశం
సినిమా షూటింగ్‌లపై ఏపీ‌ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డితో చర్చించడానికి మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో పలువురు దర్శకులు, నిర్మాతలు, పంపిణీ దారులు హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లారు.  ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న వారు.. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు తాడేపల్లిలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం వైఎస్ ‌జగన్ తో భేటీ కానున్నారు.

ముఖ్యమంత్రితో భేటీ కానున్న వారిలో చిరంజీవితో పాటు నాగార్జున, డి.సురేశ్ బాబు, రాజమౌళితో పాటు పలువురు ఉన్నారు. కాగా, చిరంజీవి నేతృత్వంలో ఇటీవల సినీ ప్రముఖులు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి చిత్ర పరిశ్రమకు సంబంధించిన సమస్యలపై చర్చించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సినిమా షూటింగ్‌లకు అనుమతి ఇవ్వాలని కోరగా కేసీఆర్‌ సానుకూలంగా స్పందించారు.
Chiranjeevi
Rajamouli
Tollywood

More Telugu News