army: జమ్మూకశ్మీర్‌లో మరో ముగ్గురు ముష్కరుల హతం.. తప్పించుకుపోయిన నలుగురి కోసం గాలింపు

army gun down terrorists
  • పూంఛ్‌ జిల్లాలోని మంధర్‌ ప్రాంతంలో చొరబాట్లకు యత్నం
  • కుట్రలను భగ్నం చేస్తోన్న భద్రతా బలగాలు
  • మిగతా నలుగురు ఉగ్రవాదుల కోసం గాలింపు
జమ్మూకశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో ఉగ్రవాదులను అంతమొందించడానికి భద్రతా బలగాలు జరుపుతోన్న ఆపరేషన్‌ విజయవంతమవుతోంది. ఇప్పటికే రెండు వారాల్లో తొమ్మిది భారీ ఆపరేషన్లు చేపట్టిన భద్రతా బలగాలు.. ఆరుగురు ఉగ్రవాద అగ్రశేణి కమాండర్లతో పాటు మొత్తం 22 మంది ఉగ్రవాదులను హతమార్చిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో ఈ రోజు పూంఛ్‌ జిల్లాలోని మంధర్‌ ప్రాంతంలో చొరబాట్లకు యత్నించిన మరో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. అయితే, ఈ సందర్భంగా మరో నలుగురు ఉగ్రవాదులు తప్పించుకుని పారిపోయారు. వారి కోసం భద్రతా బలగాలు గాలింపు ప్రారంభించాయి. హతమైన ఉగ్రవాదుల నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఉగ్రవాదుల కుట్రలను భద్రతా బలగాలు సమర్థవంతంగా భగ్నం చేస్తున్నాయి.  
army
India
Jammu And Kashmir

More Telugu News