Nara Lokesh: అన్నదమ్ముల్లా ఉన్న మా ఇద్దరి మధ్య గొడవలు పెట్టాలని యత్నిస్తున్నారు: లోకేశ్

lokesh fires on ycp leaders
  • జగన్‌ గారికి మేటర్ వీకని పేటీఎమ్ బ్యాచ్ కి అర్థమైపోయింది
  • నాకు,  రామ్‌ మోహన్‌ నాయుడికి గొడవలు పెట్టాలనుకుంటున్నారు
  • పేటీఎం బ్యాచ్ ఆవేశానికి నా సానుభూతి
  • మీ ప్రయత్నాలు మా మధ్య బంధాన్ని మరింత బలపరుస్తున్నాయి
వైసీపీ నేతలపై టీడీపీ నేత నారా లోకేశ్ మండిపడ్డారు. 'వైకాపా అధ్యక్షుడు జగన్‌  గారికి మేటర్ వీక్ అనే విషయం పేటీఎమ్ బ్యాచ్ కి అర్థం అయిపోయింది. అందుకే 5 రూపాయల చిల్లర కోసం తుప్పు పట్టిన బుర్రలకు పనిపెట్టి టీడీపీ అధ్యక్షుడి ఎంపికలో నాయకుల మధ్య వివాదం అంటూ ఫేక్ అకౌంట్లతో రచ్చ చేస్తున్నారు' అని చెప్పారు.

'అన్నదమ్ముల్లా ఉన్న నాకు, ఎంపీ రామ్‌ మోహన్‌ నాయుడి మధ్య గొడవలు పెట్టాలని ప్రయాస పడుతున్న పేటీఎం బ్యాచ్ ఆవేశానికి నా సానుభూతి. మీ ప్రయత్నాలు టీడీపీ నాయకుల మధ్య బంధాన్ని మరింత బలపరుస్తున్నాయి. టీడీపీలో ప్రతి కార్యకర్తా అధ్యక్షుడితో సమానమే అని విషయం వైకాపా పేటీఎం బ్యాచ్ కి గుర్తుచేస్తున్నాను' అని చెప్పారు. ట్విట్టర్‌లో వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందన్న విషయాన్ని ఆయన పలు స్క్రీన్‌ షాట్ల ద్వారా తెలిపారు.
             
Nara Lokesh
Telugudesam
YSRCP

More Telugu News