petrol: నేడు కూడా స్వల్పంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

petrol and diesel prices   increase by  54
  • ఢిల్లీలో నిన్న లీటరు పెట్రోల్ ధర రూ.72.46
  • ఈ రోజు 54 పైసలు పెరిగి రూ.73కి చేరిన ధర
  • డీజిల్‌ ధర నిన్న లీటరుకి రూ.70.59
  • ఈ రోజు 58 పైసలు పెరిగి రూ.71.17కి చేరిన వైనం
పెట్రోల్, డీజిల్ ధరలు వరసగా మూడో రోజు కూడా స్వల్పంగా పెరిగాయి. దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను ఈ రోజు దాదాపు 50 పైసల చొప్పున పెంచినట్లు చమురు సంస్థలు తెలిపాయి. ఢిల్లీలో నిన్న లీటరు పెట్రోల్ ధర రూ.72.46గా ఉండగా 54 పైసలు పెరిగి ఈ రోజు రూ.73కి చేరింది. డీజిల్‌ ధర నిన్న లీటరుకి రూ.70.59 ఉండగా ఈ రోజు 58 పైసలు పెరిగి రూ.71.17కి చేరింది.

ఇక ముంబయిలో లీటరు పెట్రోలు ధర 52 పైసలు పెరిగి, రూ.80.01కు చేరగా, లీటరు డీజిల్ ధర 55 పైసలు పెరిగి రూ.69.92కి చేరింది. కాగా, చమురు సంస్థలు నిన్న, మొన్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలను 60 పైసల చొప్పున పెంచిన విషయం తెలిసిందే.
petrol
diesel
India

More Telugu News