KCR: ఇప్పుడిక బాధ్యత మా పైనే ఉంది: రాజమౌళి

Rajamouli Tweet on KCR Desission
  • షూటింగ్ లకు అనుమతించిన కేసీఆర్
  • అన్ని భద్రతా ప్రమాణాలనూ పాటిస్తాం
  • కేసీఆర్ కు కృతజ్ఞతలు చెబుతూ రాజమౌళి ట్వీట్
తెలంగాణలో సినిమా షూటింగ్ లకు, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు అనుమతినిస్తూ, సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై దర్శక దిగ్గజం రాజమౌళి స్పందించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ ను పెడుతూ, ఉపాధి సిద్ధమైందని అన్నారు.

"కృతజ్ఞతలు తెలంగాణ సీఎం కేసీఆర్ గారికి. మా విజ్ఞప్తి మేరకు తిరిగి పనుల్లోకి వెళ్లేందుకు అనుమతించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు స్పందించి పరిస్థితిని తిరిగి గాడిలో పెట్టారు. ఇప్పుడిక బాధ్యత మాపై ఉంది. అన్ని రకాల భద్రతా ప్రమాణాలను, సిఫార్సులను అమలు చేస్తూ, తిరిగి పనిలో దిగాల్సిన సమయం. ఉపాధి సిద్ధమైంది" అని అన్నారు.
KCR
Rajamouli
Twitter

More Telugu News