హోం క్వారంటైన్‌కు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌.. జ్వరం, గొంతునొప్పితో బాధపడుతున్న వైనం

kejriwal home quarantine
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు. ఆయన జ్వరం, గొంతు నొప్పితో బాధపడుతున్నారు. దీంతో వైద్యులు ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.

ఈ నేపథ్యంలో ఆయన ఎవరినీ కలవకుండా ఢిల్లీలోని తన నివాసంలోనే కొన్ని రోజులు ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు మధ్యాహ్నం, రేపు ఆయన పాల్గొనాల్సి ఉన్న అన్ని సమావేశాలను వాయిదా వేస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. కాగా, ఢిల్లీలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతోన్న విషయం తెలిసిందే.
Go Back to Shorts
Quarantine Centre
Arvind Kejriwal
New Delhi

More Telugu News