కేంద్ర ఎన్నికల సంఘం అధికారికి కరోనా పాజిటివ్
- ఢిల్లీలో కరోనా బీభత్సం
- ప్రభుత్వ కార్యాలయాల్లో కరోనా కల్లోలం
- ఇటీవలే నీతి ఆయోగ్ కార్యాలయంలోనూ ఉద్యోగికి పాజిటివ్
సదరు అధికారిని చికిత్సకు తరలించి, ఆయనతో సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించి క్వారంటైన్ విధించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈసీ భవనాన్ని పూర్తిగా శానిటైజ్ చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే నీతి ఆయోగ్ కార్యాలయంలో ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో ఆఫీసును మూసివేసి శానిటైజ్ చేసిన అనంతరం తిరిగి తెరిచారు.