సైన్స్ ఫిక్షన్ కి సిద్ధమవుతున్న బాలకృష్ణ!

Balakrishna to do sequel to Aditya 369
  • మూడు దశాబ్దాల క్రితం వచ్చిన 'ఆదిత్య 369'
  • సీక్వెల్ యోచన చేస్తున్న బాలకృష్ణ
  • స్క్రిప్టు సిద్ధం చేసిన సింగీతం
  • బోయపాటి సినిమా తర్వాత ఇదే!
బాలకృష్ణ కథానాయకుడుగా సుమారు మూడు దశాబ్దాల క్రితం వచ్చిన 'ఆదిత్య 369' చిత్రం అప్పట్లో తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతినిచ్చింది. టైం మెషీన్ తో కూడిన సైన్స్ ఫిక్షన్ స్టోరీని దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు వెండితెరపై ఆవిష్కరించిన తీరు అందర్నీ ఆకట్టుకుంది. అలాంటి ఈ చిత్రానికి సీక్వెల్ చేయాలని బాలయ్య ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. దానికి 'ఆదిత్య 999' అనే టైటిల్ని కూడా ఆయన నిర్ణయించారు. ఇక ఈ చిత్రాన్ని త్వరలో చేయనున్నట్టు బాలకృష్ణ తాజాగా చెప్పారు.

ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ ఓ భారీ చిత్రాన్ని చేస్తున్నారు. దీనికి 'మోనార్క్' అనే టైటిల్ని నిర్ణయించే ఆలోచనలో చిత్రం యూనిట్ వుంది. ఇది పూర్తయ్యాక 'ఆదిత్య 999' చిత్రంపై దృష్టి పెట్టాలని బాలకృష్ణ భావిస్తున్నారు. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలోనే దీనిని భారీ బడ్జెట్టుతో నిర్మించే యోచన చేస్తున్నారు. దీనికి సంబంధించిన స్క్రిప్టును కూడా సింగీతం ఇప్పటికే సిద్ధం చేశారట.  దీని గురించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడవుతాయి.
Go Back to Shorts
Balakrishna
Aditya 369
Singeetam Shrinivasa Rao
Boyapati Sreenu

More Telugu News