దేశంలో ఒక్క రోజులో 9,983 మందికి కొత్తగా కరోనా నిర్ధారణ

తాజాగా కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో 9,983 మందికి కొత్తగా కరోనా సోకింది. దేశంలో ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. అదే సమయంలో 206 మంది మరణించారు.  
     
ఇక దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 2,56,611కి చేరగా, మృతుల సంఖ్య 7,135కి చేరుకుంది. 1,25,381  మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,24,095 మంది కోలుకున్నారు.


More Telugu News