రూ1.70 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని ముంచారు: చంద్రబాబుపై బొత్స ధ్వజం

Botsa slams Chandrababu has killed the state
  • తన హయాంలో చంద్రబాబు ఎన్ని ఇళ్లు కట్టారన్న బొత్స
  • పసిపాప లాంటి రాష్ట్రాన్ని చంపేశారని ఆగ్రహం
  • త్వరలో విశాఖ ప్రజల కోరిక తీరుతుందని వెల్లడి
ఏడాది పాలనలో వైసీపీ ప్రభుత్వం చేసిందేమీ లేదని చంద్రబాబు అంటున్నారని, మరి తన హయాంలో ఎన్ని ఇళ్లు కట్టారో ఆయన చెప్పాలని ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. రూ.1.70 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని ముంచారని చంద్రబాబుపై మండిపడ్డారు.

రాష్ట్ర విభజన తర్వాత పసిపాప లాంటి రాష్ట్రాన్ని చంద్రబాబు చేతిలో పెడితే చంపేశాడని విమర్శించారు. విశాఖలో బలవంతపు ల్యాండ్ పూలింగ్ జరిగినట్టు నిరూపిస్తే తాను బాధ్యత వహిస్తానని బొత్స స్పష్టం చేశారు. రాష్ట్రంలో విద్య, వైద్య రంగాల అభివృద్ధికి జగన్ ప్రభుత్వం పెద్దపీట వేసిందని వెల్లడించారు. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కావాలన్నది ఆ ప్రాంత ప్రజల కోరిక అని, త్వరలో విశాఖ ప్రజల కోరిక తీరుతుందని అన్నారు.
Go Back to Shorts
Botsa Satyanarayana
Chandrababu
Andhra Pradesh
Jagan
Vizag

More Telugu News