ముందుంది మొసళ్ల పండుగ... టీఆర్ఎస్ నేతలకు దీటుగా బదులిచ్చిన రేవంత్ రెడ్డి
- రేవంత్ ఐరన్ లెగ్ అంటూ వ్యాఖ్యానించిన టీఆర్ఎస్ నేతలు
- ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ నాశనం అని వెల్లడి
- వెనుకంజ వేసేది లేదంటూ సంకేతాలు పంపిన రేవంత్
రేవంత్ రెడ్డి ఐరన్ లెగ్ అని, రేవంత్ ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ సర్వనాశనం అవుతుందని వ్యాఖ్యానించారు. రేపటి నుంచి రేవంత్ బాగోతాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తాయని హెచ్చరించారు. అయితే, దీనిపై రేవంత్ దీటుగా స్పందించారు. "ముందుంది మొసళ్ల పండుగ... రేపు మధ్యాహ్నం 1 గంటకు!" అంటూ ఈ వ్యవహారంలో తాను వెనుకంజ వేసేది లేదన్న బలమైన సంకేతాలు పంపించారు. అయితే రేపు రేవంత్ ఏంచేయనున్నారన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు.