ఏపీలో 130 కరోనా పాజిటివ్ కేసులు... ఇద్దరి మృతి

  • గత 24 గంటల్లో 17,695 శాంపిల్స్ పరీక్ష
  • 30 మంది డిశ్చార్జి
  • కర్నూలు జిల్లాలో ఒకరు, కృష్ణా జిల్లాలో మరొకరు మృతి
ఏపీలో గత 24 గంటల్లో 17,695 నమూనాలు పరీక్షించగా 130 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దాంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,718కి చేరింది. ఇవాళ 30 మందిని డిశ్చార్జి చేశారు. ఈ నేపథ్యంలో మొత్తం 2,353 మంది కరోనా నుంచి కోలుకున్నట్టయింది. ప్రస్తుతం 1,290 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక, కృష్ణా జిల్లాలో ఒకరు, కర్నూలు జిల్లాలో ఒకరు కరోనాతో మరణించగా, మొత్తం మృతుల సంఖ్య 75కి పెరిగింది.

Andhra Pradesh
Corona Virus
Deaths
Positive
COVID-19

More Telugu News