Mahesh Babu: మహేశ్ బాబు పాటలకు డ్యాన్స్ చేసిన 75 మంది డాకర్లు, నర్సులు.. వీడియో వైరల్

doctors dance for maheshbabu songs
  • కరోనా జాగ్రత్తలు చెప్పిన వైద్య సిబ్బంది
  • ఆంధ్రా హాస్పిటల్‌ వినూత్న ప్రయోగం
  • అలరిస్తోన్న వైద్యుల డ్యాన్స్
సినీనటుడు మహేశ్ బాబు సినిమా పాటలకు డ్యాన్స్‌ చేస్తూ 75 మంది వైద్యులు, నర్సులు కరోనాపై అవగాహన కల్పించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.  ఆంధ్రా హాస్పిటల్‌కి చెందిన వైద్య సిబ్బంది ఇలా కరోనా వ్యాప్తి, దాని వల్ల నష్టాలపై వివరించి చెప్పారు. ఈ విపత్కర పరిస్థితుల్లో అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు తెలిపారు.
                       
మహేశ్ బాబు నటించిన సినిమాలోని 'పదర పదర పదర' పాటతో పాటు 'వచ్చాడయ్యే సామి', 'కాలమనే నదిలో', 'చలో రే చలో' పాటకు వారంతా డ్యాన్సులు చేశారు. సూపర్‌స్టార్‌ స్టైల్‌లో కరోనా జాగ్రత్తలు చెబుతున్నామని చెప్పారు. చివరకు 'సరిలేరు నీకెవ్వరు' పాటను వినిపించారు.
Mahesh Babu
Tollywood
Corona Virus
Viral Videos

More Telugu News