Tamilnadu: ప్రియురాలి కోసం వెళ్లి ఆమె ఇంట్లో దొరికిపోయి హత్యకు గురైన యువకుడు

youngster kills in tamilnadu
  • తమిళనాడులోని కడలూరు జిల్లాలో ఘటన
  • 18 నెలలుగా ప్రేమించుకుంటోన్న జంట
  • లాక్‌డౌన్‌ నేపథ్యంలో అమ్మాయిని చూడలేకపోతోన్న యువకుడు
  • ఆమె ఇంటికి వెళ్లడంతో చంపేసి పారిపోయిన కుటుంబం
ఓ యువకుడు తన ప్రియురాలి ఇంట్లోనే దారుణ హత్యకు గురైన ఘటన తమిళనాడులో సంచలనమైంది. కడలూరు జిల్లాలోని చిదంబరానికి చెందిన అన్భళగన్‌(21) అనే యువకుడు ఓ అమ్మాయి (18)ని ప్రేమిస్తున్నాడు. వారిద్దరు 18 నెలల నుంచి ప్రేమాయణం కొనసాగిస్తున్నారు. కరోనా విజృంభణతో విధించిన లాక్‌డౌన్‌ కారణంగా వారిద్దరు ఒకరినొకరు కలుసుకోలేకపోయారు.

ఇటీవల ఆమెను ఎలాగైనా చూడాలని  ఆమె ఇంటి వద్దకు వెళ్లాడు. అయితే, అతడిని గుర్తించి ప్రియురాలి కుటుంబ సభ్యులు అతడిని వెనక్కి పంపారు. తాజాగా మరోసారి ఆమె ఇంటికి వెళ్లాడు. అతడి ప్రియురాలి తండ్రి, తల్లి, సోదరుడు ఇంట్లోనే ఉన్నారు. వారంతా కలిసి అతడిని పట్టుకుని నరికి చంపారు.

దీంతో అక్కడికక్కడే  అన్భళగన్‌ ప్రాణాలు కోల్పోయాడు. తమ పరువు తీస్తున్నాడన్న కోపంతోనే తాము అతడిని చంపామని ఆ కుటుంబం ఓ లేఖను ఇంట్లో ఉంచి పారిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ కేసును ప్రేమ పరువు హత్యగా గుర్తించారు. నిందితులు బాబు అతడి భార్య సత్యతో పాటు వారి కుమారుడు, కూతురి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Tamilnadu
Crime News

More Telugu News