ఏ విద్యార్థి అయినా కరోనాతో మరణిస్తే ఎవరిది బాధ్యత?: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు సూటి ప్రశ్న
- పదో తరగతి పరీక్షలపై హైకోర్టులో విచారణ
- జీహెచ్ఎంసీ పరిధిలోనూ పరీక్షలకు అనుమతి కోరిన సర్కారు
- నిరాకరించిన హైకోర్టు
దాంతో హైకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఎవరైనా విద్యార్థి కరోనాతో మరణిస్తే ఆ బాధ్యత ఎవరిదని సూటిగా ప్రశ్నించింది. జీహెచ్ఎంసీ పరిధిలో పదో తరగతి పరీక్షలు వాయిదా వేయాలని స్పష్టం చేసింది. అంతేకాదు, జీహెచ్ఎంసీ పరిధిలోని టెన్త్ విద్యార్థులను సప్లిమెంటరీ పరీక్షకు అనుమతించాలని, సప్లిమెంటరీ ఉత్తీర్ణులను కూడా రెగ్యులర్ కింద గుర్తించాలని ఆదేశించింది.